temple traditions
-
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
‘మనగుడి’
కంకణాలకు పూజలు తిరుమల:హైందవ ధర్మాలు, ఆలయ సంప్రదాయాలను కాపాడటం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘మనగుడి’ ఐదో విడత కార్యక్రమాన్ని వచ్చేనెల 10వ తేదీన రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచిన కంకణాలను ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రదర్శనగా ఆలయానికి తీసుకెళ్లారు. గర్భాలయంలో మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని 52వేల ఆలయాలకుతరలిస్తామని ఈవో గిరిధర్ గోపాల్ వెల్లడించారు. వీఐపీ టికెట్లు ఇక 800 లోపే వెంకన్న దర్శనంకోసం వీఐపీ బ్రేక్ టికెట్లు ఇకనుంచి రోజుకు 800 లోపే కేటాయించనున్నామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. సాధారణ భక్తుల రద్దీ, ప్రభుత్వ ఉద్దేశం, ప్రాధాన్యతల ప్రకారం టీటీడీ నడుచుకుంటోందని, ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం విలేకరులకు వివరించారు. వీఐపీ భక్తులు కానివారు సిఫారసు లేఖలతో వచ్చి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఆశించవద్దని విజ్ఙప్తి చేశారు. గతంలో వీఐసీలకు రోజుకు మూడు వేలకు పైగా ఇచ్చేవారమని, పెరుగుతున్న సాధారణ భక్తుల రద్దీకి అనుగుణంగా వాటిని 800లకు కుదించామన్నారు.