రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దేవరపల్లి: టెన్నికాయిట్ పోటీల్లో మండలంలోని పల్లంట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఈ.చరిత, ఎం. నవ్య, ఎ.సత్యవతి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో చరిత, ఎం.నవ్య ద్వితీయ, ఎ.సత్యవతి తృతీయ స్థానాలు సాధించినట్టు పీఈటీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ విభాగంలో ఆర్.వెంకటేశ్వరరావు ప్రథమ స్థానం సాధించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయనగరంలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. దేవరపల్లి శ్రీసాయి లిటిల్ హార్ట్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని జి.హేమమాధురి అండర్–14 విభాగంలో సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యిందని పీఈటీ ఎం.మురళీ తెలిపారు.