6 నుంచి జాతీయ సీనియర్ టెన్నిస్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక సుందరాచార్యుల ఆఫీసర్స్ రిక్రియేషన్ అసోసియేషన్‌లో ఈనెల 6 నుంచి 12 వరకు అఖిల భారత టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ భారత సీనియర్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నట్లు కో-ఆర్డినేటర్ సి.రామగోవిందరెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ 55 ఏళ్లు పైబడ్డ విభాగంలో క్రీడాకారులకు టెన్నిస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.2.50లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో వ్యాయామ అధ్యాపకుడు మహబూబ్‌బాషా పాల్గొన్నారు.