tenth topers
-
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
మాట నిలబెట్టుకున్న సీఎం.. టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాప్టర్ రైడ్
రాయ్‌పూర్: టెన్త్, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హెలికాప్టర్ రైడ్ కల్పిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని హెలికాప్టర్లో తనతో పాటు తీసుకెళ్లి గగన విహారం చేయించారు. తొలిసారి హెలికాప్టర్ ఎక్కిన క్రమంలో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలా సంతోషంగా ఉందని, ఈ రైడ్ ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ ఉత్సాహం నింపినట్లవుతుందన్నారు. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులను హెలికాప్టర్లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. చదవుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంగా హెలికాప్టర్ రైడ్‌పై ట్వీట్ చేశారు. ‘చూడండి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో. 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన వారిని హెలికాప్టర్లో తిప్పుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. 125 మంది విద్యార్థులు ఈ హెలికాప్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు.. విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర మంత్రి ప్రేమ్‌సాయి సింగ్ టెకమ్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. #WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022 𝗛𝗲𝗹𝗶𝗰𝗼𝗽𝘁𝗲𝗿 𝗥𝗶𝗱𝗲🚁 देखिए, बच्चे कितने खुश हैं! हमने वादा किया था कि 10वीं और 12वीं के टॉपर बच्चों को हम हेलीकॉप्टर राइड कराएँगे। आज इसकी शुरुआत हो गयी है। कक्षा 10वीं और 12वीं के 125 छात्र-छात्राएं लेंगे हेलीकॉप्टर जॉयराइड का आनंद। pic.twitter.com/5c4dbOvTbx — Bhupesh Baghel (@bhupeshbaghel) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
టెన్త్ టాపర్లతో మంత్రి సహపంక్తి భోజనం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో పది గ్రేడ్‌పాయింట్లు సాధించిన 62 మంది విద్యార్థులతో కలసి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం సహపంక్తి భోజనం చేశారు. పది ఫలితాల్లో జిల్లాను వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిపినందుకు కలెక్టర్ శరత్‌ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కలెక్టర్‌తోపాటు విద్యాధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే నూరుశాతం ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాలో 15వేల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం 35 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారన్నారు. ‘ఉత్తేజం’కార్యక్రమానికి దాతలు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. -
విద్యార్థులు ప్రొఫార్మా అందజేయాలి : డీఈవో
శ్రీకాకుళం : ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక పాయింట్లు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన విద్యార్థులు సంబంధిత ప్రొఫార్మా నింపి ప్రధానోపాధ్యాయులచే సంతకం చేయించి రెండు రోజుల్లో తమ కార్యాలయానికి అందజేయాలని డీఈవో దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఒక కాపీ ఉప విద్యాశాఖాధికారిగాని, మండల విద్యాశాఖాధికారిగాని, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయానికి అందజేయాలిన సూచించారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 15న విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో జరిగే రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.