విద్యార్థిని ఆత్మహత్య
ఆత్మకూరు : ఆత్మకూరు మండలం తలుపూరులో రమాదేవి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె హేమలత(14) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ధరణికిశోర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే హేమలత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేదన్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున కడుపునొప్పి ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది విష గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుందన్నారు.
కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను అనంతపురం పెద్దాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.