thimsa dance
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
సాక్షి, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాలి
సీతంపేట: గిరిజన సంస్కృతి సంప్రదాయాలను బయట ప్రపంచానికి చాటిచెప్పాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పిలుపునిచ్చారు. సీతంపేట బాలికల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆదివాసీ నృత్యాల శిక్షణా రీతులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. గిరిజన బాలికలతో కలిసి కాసేపు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు బి.జయలక్ష్మి, డిప్యూటీ డీఈవో వి.మల్లయ్య, గురుకుల సెల్ ఇన్చార్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్లు సురేష్, యుగంధర్, యూత్కన్వినర్ మోహన్రావు, గణేష్ పాల్గొన్నారు.