ఎల్ఈడీలు ఇక మరింత పలుచన
ప్రపంచంలోనే అతి పలుచని ఎల్ఈడీ (లైట్ ఎమిట్టింగ్ డయోడ్)ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు ఇటీవల తయారు చేశారు. వీరు తయారు చేసిన ఎల్ఈడీ మిల్లీ మీటర్లు, నానో మీటర్లు కూడా కాదు.. జస్ట్ మూడు అణువులంత మందం మాత్రమే ఉండటం విశేషం.
మనిషి వెంట్రుక కన్నా పది వేల రెట్లు పలుచగా ఉండే ఈ ఎల్ఈడీలను ఉపయోగించి టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేయొచ్చని, వీటివల్ల భవిష్యత్తులో మరింత పలుచనైన ఎలక్ట్రానిక్ పరికరాలు రానున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.