ఇంగ్లండ్, శ్రీలంక మూడో వన్డే రద్దు
బ్రిస్టల్: వర్షం కారణంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఇక్కడ జరిగిన మూడో వన్డే మ్యాచ్ రద్దయింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. చండీమల్ (62), మ్యాథ్యూస్ (56), కుషాల్ మెండిస్ (53) అర్ధ సెంచరీలు చేయగా... వోక్స్, ప్లంకెట్ చెరో 3 వికెట్లు తీశారు.
అనంతరం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో వచ్చిన వర్షం మళ్లీ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఐదు వన్డేల సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.