ఆన్లైన్లో మూడో విడత రుణమాఫీ జాబితా
హైదరాబాద్ : రుణమాఫీ అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. రుణమాఫీ జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టింది. మూడో విడత రైతు రుణమాఫీకి రూ.894 కోట్లకు తొలి విడతగా రూ.380 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4.74 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
కాగా బ్యాంకర్లు నమోదు చేయని 58వేల దరఖాస్తులను పునపరిశీలకకు పంపామని, బ్యాంకు నుంచి వివరాలు రాగానే నేరుగా ఆన్లైన్లో పెడతామని ప్రణాళిక మండలి అధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. రుణామఫీ అనర్హతపై ఫిర్యాదులు ఉంటే వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉద్యానవన పంటల లబ్ధిదారులను ఎంపిక చేయలేదని, కేసులు, ఆడిటింగ్ అభ్యంతరాలున్న బ్యాంకులు, సొసైటీ రైతులకు రుణాలు విడుదల చేయలేదన్నారు. కాగా మూడో విడత రైతు రుణమాఫీకి రూ.894 కోట్లకు తొలి విడతగా రూ.380 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
apcbsportal.ap.gov.in/loanstatus ద్వారా సరిచూసుకోవచ్చు.