బొద్దుగా ఉన్నారా? బీ కేర్‌ఫుల్...
లావుగా ఉన్నవారు చీర ఎంపిక చేసుకుంటే మరీ ట్రాన్స్పరెంట్గా కాకుండా మీడియం టెక్స్చర్ ఉండే ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. అలాగని మందం బట్టను సెలక్ట్ చేసుకోవద్దు. ఇక డ్రెస్ సెలక్ట్ చేసుకున్నప్పుడు శాటిన్ కాకుండా అన్ని రకాల ఫాలింగ్ ప్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
డ్రెస్సులు కుట్టించుకునేటప్పుడు కాటన్ లైనింగ్ వాడకూడదు. కాటన్ మిక్స్ ఉన్న లిజిబిజి క్లాత్, క్రేప్, శాటిన్ మాత్రమే లైనింగ్‌గా వాడాలి. చుడీ కుట్టించుకుంటే నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో కాకుండా కొద్దిగా మందం బట్టతో కుట్టించుకోవాలి. సల్వార్ అయితే జార్జెట్, క్రేప్ మెటీరియల్‌కి సన్నని లైనింగ్ మాత్రమే వాడాలి. అనార్కలీలు కుట్టించుకోవాలంటే ఎంపైర్లైన్ నుంచి ఫ్లేర్ లైన్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది.
ఛాతి భాగంలో మాత్రం మరీ పలచని, మందం కాని బట్టను ఎంచుకోవాలి. బెనారస్, బ్రొకేడ్ క్లాత్‌లను అనార్కలీకి వాడకూడదు. ట్రౌజర్లు వేసుకోవాలనుకుంటే జ్యూట్ మిక్సింగ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్ వాడాలి. వెల్వెట్స్, సింథటిక్ మెటీరియల్ వాడకూడదు. పల్చగా ఉన్న టీ షర్ట్స్ వీరికి అంతగా నప్పవు. సరైన ఫ్యాబ్రిక్, ప్యాట్రన్, కట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే లావుగా ఉన్నవారూ అన్ని రకాల డ్రెస్సులు ధరించవచ్చు.