రేపు జిల్లాకు చంద్రబాబు రాక
ఏలూరు, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదివారం తెలిపారు. 26న ఉదయం 9గంటలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి చించినాడ బ్రిడ్జి వద్ద జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశిస్తారని చెప్పారు. నరసాపురం, పాలకొల్లు, భీమవ రం నియోజకవర్గాల్లోని తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తాని వివరించారు. అనంతరం ఆకివీడు మీదుగా కృష్ణాజిల్లాలోకి ప్రవేశిస్తారు. పర్యటన రూట్ మ్యాప్‌ను సోమవారం పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేయనున్నట్టు సీతారామలక్ష్మి వెల్లడించారు.