three babies in single delivery
-
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
కర్నూలు(హాస్పిటల్): ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరికి చెందిన మున్ని(35)కి అక్బర్‌బాషతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదటి సారి అబార్షన్ కాగా ఐదేళ్ల క్రితం సాధారణ ప్రసవం అయ్యింది. అప్పటి నుంచి మళ్లీ గర్భం దాల్చకపోవడంతో గైనకాలజీ విభాగంలో చికిత్స చేయించుకోవడంతో గర్భం దాల్చింది. కొంతకాలం తర్వాత స్కానింగ్ చేయగా ఆమె గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఆమెకు వైద్యం అందిస్తూ జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. ఆమెను 25 రోజులు ముందుగా ఈ నెల 5న ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన చికిత్స అందించారు. శనివారం ఆమెకు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. ప్రసవంలో ఒక ఆడ, ఇద్దరు మగశిశువులు జన్మించారు. ఆడ శిశువు, మగశిశువు రెండేసి కిలోలు ఉండగా, మరో మగశిశువు 1.5కిలోల బరువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ సుప్రియ, అనెస్తీషియా వైద్యులు శ్రీనివాసులు, మహేష్, పీజీలు మోనీషా, ఆఫ్రిన్ పాల్గొన్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ దానేటి శ్రీధర్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ పద్ధతిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చింది. రణస్థలం మండలం నగరపాలెం గ్రామానికి చెందిన కెల్ల తాత, పుష్పవతిలకు వివాహం జరిగి 18 సంవత్సరాలైంది. అయితే సంతానం లేకపోవడంతో వారు డాక్టర్ దానేటి శ్రీధర్ని సంప్రదించారు. డాక్టర్ సలహా మేరకు ఐవీఎఫ్ పద్ధతిలో చికిత్స పొందారు. అనంతరం పుష్పవతి గర్భం దాల్చింది. సోమవారం రాత్రి ఒక మగ, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. డాక్టర్ స్వర్ణలత, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వినోద్‌కుమార్, మేనేజర్ కృష్ణకాంత్ నిరంతం పర్యవేక్షణ చేసినట్టు వైద్యుడు తెలిపారు. -
ఒకే కాన్పులో ముచ్చటగా ముగ్గురు
తూర్పుగోదావరి, ఏలేశ్వరం (పత్తిపాడు) : ఏలేశ్వరంలో శుక్రవారం ఓ మాతృమూర్తి ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. పట్ణణంలోని పెద్దవీధి ఎస్సీపేటకు చెందిన శ్రీకాకోలు సం«ధ్య (22) రెండో కాన్పు నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు రామలక్ష్మి పర్యవేక్షణలో సహజ ప్రసవం చేశారు. పుట్టిన ముగ్గురు ఆడపిల్లలూ ఒక్కొక్కరు కేజీన్నర బరువు ఉండి ఆరోగ్యంగా ఉన్నారు. రామలక్ష్మి భర్త రత్నరాజు కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ దంపతులకు మొదటి కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజ సహజ ప్రసవం అయ్యేలా సేవలు అందించిన వైద్యురాలు రామలక్ష్మిని, సిబ్బందిని పలువురు అభినందించారు. తల్లితో పాటు ముగ్గురు పిల్లలను వెద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు ౖతరలించారు. -
మమతల తల్లి
మైసూరు : వరమహాలక్ష్మీ పండుగ సందర్భం గా శుక్రవారం రాత్రి ఓ మహిళ ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. నగరంలోని విజయనగర్‌కు చెందిన సవితాకు పురిటి నొప్పులు రావడంతో భర్త ప్రేమ్‌కుమార్ ఆమెను చెలువాంబ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముగ్గురు పిల్లలున్నట్లు గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఒకే కాన్పులో ముగ్గురి జననం
సాక్షి, సుల్తాన్‌బజార్: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మంచిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం భార్య మల్లీశ్వరి నెలలు నిండటంతో శనివారం రెండవ కాన్పు కోసం ప్రసూతీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఇద్దరు మగశిశువులు, ఆడశిశువు ఒకే కాన్పులో జన్మించారు. వారు చిన్నపిల్లల విభాగంలోని అసోలేషన్ వార్డులో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు. -
ట్రిపుల్ ధమాకా
ఒకే కాన్పులో ముగ్గురు జన్మించిన అరుదైన సంఘటన తణుకు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన దేవ్కర్ నామదేవ్ కుటుంబం తణుకులో స్థిరపడింది. నామదేవ్ బంగారం పని చేస్తుంటాడు. అతని భార్య సవితకు నెలలు నిండటంతో తణుకులోని విజయ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు. గురువారం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించగా, ఉదయం 11.41 గంటలకు ఒక పాప జన్మించింది. 11.43 గంటలకు మరొక పాప, 11.45 గంటలకు బాబు జన్మించారు. మొదటి పాప 2.5 కేజీలు, రెండవ పాప 2.8 కేజీలు, బాబు 2.3కేజీల బరువు ఉన్నట్లు వైద్యురాలు డాక్టర్ లక్ష్మి చెప్పారు. సాధారణంగా ముగ్గురు శిశువులు ఒకేసారి జన్మిస్తే.. బరువు తక్కువ ఉంటారని, కొన్ని లోపాలు కూడా ఉండే అవకాశం లేకపోలేదని అన్నారు. ఈ ముగ్గురు శిశువులు తగిన బరువుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆమె వివరించారు. చిన్నారుల తండ్రి నామదేవ్ మాట్లాడుతూ తన భార్యకు ఆరేళ్ల క్రితం మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించిందని చెప్పాడు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందన్నాడు. - న్యూస్‌లైన్/తణుకు అర్బన్