పిడుగుపాటుకు ముగ్గురి మృతి
ప్రకాశం జిల్లాలో తీవ్రంగా కురుస్తున్న వర్షాలకు తోడు పిడుగులు కూడా పడటంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంలో పిడుగు పడి ఓ మహిళ మృతిచెందారు. అనంతలక్ష్మి అనే మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరు మహిళలకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే, ఎర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లిలో పిడుగుపడి ఒకరు మరణించారు. జె.వంగలూరు మండలం కోడుమూరులో కూడా పిడుగు పాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.