పిడుగుపాటుకు మహిళ మృతి
ఐదుగురికి గాయాలు
ఒక దుక్కిటెద్దు మతి
పినపాక: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఓ మహిళ మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక దుక్కిటెద్దు మతిచెందింది. పినపాక మండలం గోపాలరావుపేటకు చెందిన అనిపెద్ది లలిత(25) పొలంలో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మతిచెందింది. మతురాలు లలితకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నలుగురికి గాయాలు
ఇల్లెందు : సుదిమళ్ల గ్రామ పంచాయతీ పూబెల్లి గ్రామ సమీపంలోని చేనులో మూతి చంటి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్షం పడుతుండటంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లాడు. అప్పుడే పిడుగు పడటంతో చంటికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే చెట్టు కింద ఉన్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే రొంపేడు గ్రామ పంచాయతీ నాయకులగూడెం గ్రామానికి చెందిన సూర్నపాక చుక్కయ్యకు చెందిన దుక్కి టెద్దు పిడుగు పడటంతో అక్కడికక్కడే మతిచెందింది. దీని విలువ సుమారు రూ.50వేలు ఉంటుంది.
యువ రైతుకు తీవ్ర గాయాలు
టేకులపల్లి : కొప్పురాయి పంచాయతీ మోదుగులగూడెంకు చెందిన పాయం విజయ్‌భాస్కర్ గ్రామ సమీపంలోని తన పత్తి చేనులో మందు కొడుతున్నాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వెంటనే పెద్ద శబ్దంతో యువకుడు ఉన్న సమీపంలో పిడుగు పడింది. దీంతో విజయభాస్కర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సర్పంచ్ పూనెం మోహన్‌రావు తెలిపారు. వెంటనే టేకులపల్లికి చెందిన 108 అంబులెన్స్‌లో సులానగర్ పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.