వెండితెరపై చలం ‘త్యాగం’
తెలుగు సాహిత్యంలో చలం రచనలకు ఇప్పటికీ అగ్రతాంబూలమే. ఆయన రచన ‘దోషగుణం’ ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ ‘గ్రహణం’ అనే సినిమా తీసి జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. చలం ప్రసిద్ధ నవల ‘మైదానం’ వెండితెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చలం మరో నవల ‘త్యాగం’ ఇప్పుడు తెరకెక్కుతోంది. ‘అనుష్టానం’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో మాధవీ లత ఓ పల్లెటూరి అమ్మాయిగా నటి స్తోంది. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘చలం రచన ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రంలో నేను పల్లెటూరు అమ్మాయిగా నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్రను ప్రతి అమ్మాయీ ఇష్టపడుతుంది’’ అన్నారు. ఎంపీ రవిరాజ్ రెడ్డి నిర్మాతగా కృష్ణ వాసా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘గజల్’ శ్రీనివాస్ ఇందులో ముఖ్య పాత్రధారి.