timber caught
-
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
ఖానాపూర్: అక్రమంగా తరలిస్తున్న కలపను ఖానాపూర్ రేంజి అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా పెంబి నుంచి ఆటోలో తరలిస్తున్న ఐదు టేకు దుంగలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కలప విలువ రూ.15 వేలు ఉంటుందని ఎఫ్ఆర్వో ఉత్తమ్రావు తెలిపారు. -
టేకు దుంగలు పట్టివేత
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజీనగర్ సమీపంలో టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కారులో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందడంతో అధికారులు సోదాలు జరిపారు. అధికారులను చూసి డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. దీంతో కారుతో పాటు, కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు రిజిస్ర్టేషన్ నెంబరు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.