ఫారెస్ట్ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి, 11మంది అరెస్ట్
మహబూబ్ నగర్: కలప స్మగ్లింగ్ కార్యకలాపాలు యథేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. అందిన సమాచారం మేరకు మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కోడుగల్లులో అధికారులు తనిఖీలు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న కలప స్మగ్లర్లను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నించారు. దాంతో కలప స్మగ్లర్లు దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా తరలిస్తున్న కలప రవాణాను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దుండగులు దాడి చేశారు. దాంతో 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.