కోట సత్తెమ్మకు బంగారు నెక్లెస్ సమర్పణ
నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోట సత్తెమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన ఎలక్టిక్రల్ డీఈ విలపర్తి శ్రీరామచంద్రమూర్తి, పద్మావతి దంపతులు గురువారం కాసు బంగారు నెక్లెస్ సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్తి్ర, ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.