ముగిసిన కోటసత్తెమ్మ తిరునాళ్లు
నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద చండీ పారాయణ, సాయంత్రం చండీ హోమం, ఊయల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి గరగనృత్యాలు, పూల గరగలు ఆకట్టుకున్నాయి. తణుకు పట్టణానికి చెందిన అంబికా డా¯Œ్స అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేశారు. కనక తప్పెట్లు, తాసమరపాలు, రామడోలు, వీరణం, రాజరాజేశ్వరి, కాళీమాత నృత్య ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఘనంగా బాణా సంచా కాల్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.