వేడుకగా తిరుచ్చి ఉత్సవం
నెల్లూరు(బృందావనం):
రంగనాయకులపేటలోని శ్రీదేవి, దేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో నరకచతుర్దశి, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్వామికి సంప్రదాయబద్ధంగా బంగారుతిరుచ్చి పేట ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి శాస్త్రోక్తంగా విశేషపూజలు జరిగాయి. ఉత్సవాన్ని ఆలయ పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, దేవస్థానం కార్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు.