బంగ్లాదేశీయులకు 5 నెలల జైలు శిక్ష
తిరుపతి: 19 మంది బంగ్లాదేశీయులకు తిరుపతి అయిదవ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి మంగళవారం అయిదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న వెంటనే వారిని భారత్లోని బంగ్లాదేశ్ రాయబారికి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
సరైన పత్రాలు, వీసాలు లేకుండా ఉన్న 19 మంది బంగ్లాదేశీయులను గతంలో చిత్తూరు జిల్లా రేణుగుంటలో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా... రిమాండ్ విధించింది. కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించింది.