కాటమరాయుడు టైటిల్ సాంగ్ ఇదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాటమరాయుడు సినిమాలో సాంగ్ అంటూ ఓ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వెస్ట్రన్ బీట్స్ తో రూపొందించిన ఈ సాంగ్ పవన్ అభిమానులు రూపొదించి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. పవన్ వ్యక్తిత్వం ప్రతిభింబించేలా రూపొందించిన ఈ పాట, పవర్ స్టార్ గత సినిమాల్లోని ఇంట్రడక్షన్ సాంగ్స్ తరహాలోనే ఉంది. దీంతో ఇదే.. కాటమరాయుడు సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అయి ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ రికార్డ్ ను సొంతం చేసుకున్న కాటమరాయుడు టీజర్, కేవలం 57 గంటల్లో 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.