tobaco board
-
టొబాకో బోర్డు ఛైర్మన్గా రఘునాథబాబు బాధ్యతలు
సాక్షి, గుంటూరు: బీజేపీ సీనియర్ నాయకుడు టొబాకో బోర్డు చైర్మన్గా యడ్లపాటి రఘునాథబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రఘునాథ్ బాబుకు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తఫా, బీజేపీ నాయకులు కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఐటీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. టొబాకో బోర్డు చైర్మన్ పదవిలో రఘునాథబాబు మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
ప్రకాశం: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొడవారిపాలెంలో పొగాకు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లినేని కృష్ణారావు(40) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్థాపం చెందిన కృష్ణారావు మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా రైతుల పట్ల పొగాకు బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆందోళన చేపట్టారు. కృష్ణారావు మృతదేహంతో ఓంగోలు పొగాకు ఆర్ఎమ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.