రెండు రోజులకే టమాట కౌంటర్ మూత
అనంతపురం అగ్రికల్చర్ : కిలో రూ.60 అంటూ మార్కెటింగ్‌శాఖ ఆర్భాటంగా రైతుబజార్లో శుక్రవారం ప్రారంభించిన టమాట కౌంటర్ రెండు రోజులకే మూతేశారు. ఆదివారం ఉదయం కాసేపు అమ్మిన ఆ శాఖ సిబ్బంది... స్టాకు లేదంటూ బోర్డు తగిలించేసి వెళ్లిపోయారు. ఆదివారం కావడంతో కొందరు వినియోగదారులు రైతుబజార్‌కు వచ్చి.. కౌంటర్మూతేయడం చూసి నిరాశతో వెనుదిరిగారు. మొదటి రోజు కొనుగోలు చేసి తీసుకొచ్చిన టమాటాలు అయిపోయినట్లు తెలిపారు. కిలో రూ.60 కావడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. బయట కూడా కాస్త అటు ఇటుగా లభిస్తున్నాయని, చాలా మంది పెదవి విరిచారు. ఉన్న టమాటాలను సమీప ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు అమ్మేసి కౌంటర్ క్లోజ్ చేశారు. సోమవారం కూడా టమాటాలు అందుబాటులో ఉండదని బోర్డు అతికించారు.