Tondupally outer junction
-
దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత దిశను నిందితులు హతమార్చారని, అనంతరం శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసి తగులబెట్టారని, ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా.. ఆ దృశ్యం తొండూపల్లి టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. చదవండి: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి! -
తొండుపల్లి టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలు
సాక్షి, శంషాబాద్: ‘సీసీ కెమెరాల ఏర్పాటు.. నేరం జరిగాక ఆధారాలు సేకరించడానికి కాదు.. నిరంతర పర్యవేక్షణతో నేరాల నియంత్రణకు వాటిని వినియోగించాలి.. సీసీ ఫుటేజీ రికార్డు కూడా స్పష్టంగా లేదు’ అని శంషాబాద్ ఘటన తర్వాత పోలీసుల తీరుపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండేళ్ల కిందట ఓ వృద్ధుడు నర్కూడ సమీపంలోని ఒయాసిస్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతని మెడ భాగంలో పదునైన ఆయుధంతో దాడిచేశారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నేరస్తులను గుర్తించలేదు. కారణమేమంటే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం. ఆరు నెలల కిందట నర్కూడలోని అమ్మ పల్లి దేవాలయంలో గుర్తుతెలియని దుండ గులు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఇక్కడ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఉండగా.. ఫుటేజీని నిక్షిప్తం చేసే హార్డ్ డిస్క్‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో దుండగుల ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. నేరాల అదుపు, నియంత్రణలో భాగంగా నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. శంషాబాద్ మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిలో ఔటర్ టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు స్పష్టంగా లేదని పేర్కొనడం ఆందోళన కల్గిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి పోలీసులు దాతల సహకారంతో విడతల వారీగా రహదారులు, ప్రధాన రోడ్లు, కూడళ్లతో పాటు గ్రామాల్లో 1400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ తరహా కెమెరాలు ఉన్నాయి. వీటిని ఇంటర్నెట్ ద్వారా సెల్ఫోన్లకు అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఈ కెమెరాలు హెచ్డీ కెమెరాల కంటే కూడా నాణ్యమైనవిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, ఔటర్ మార్గం, పరిసరాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాల నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. తొండుపల్లి వద్ద జరిగిన ఘటనలో ఈ కెమెరాల్లో ఆధారాలు సరిగా రికార్డు కాలేదని మహిళా కమిషన్ సభ్యురాలు చెప్పడం గమనార్హం. తీరు మారేనా.. ఆదివారం తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం పశు వైద్యురాలి హత్యోదంతం తర్వాత కూడా ఔటర్ టోల్‌గేటు వద్ద తీరు మారడం లేదు. శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద గత నెల 28న పశువైద్యురాలి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ టోల్గేట్ వద్ద సర్వీసు దారి లారీలకు అడ్డాగా మారడంతోనే ఈ దురాఘతం చోటు చేసుకుంది. ఇంత దారుణం చోటు చేసుకున్న తర్వాత కూడా లారీల పార్కింగ్ నివారణకు చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొండుపల్లి గ్రామం నుంచి సర్వీసు మార్గం వరకు దాదాపు 300 మీటర్ల దూరం పూర్తిగా లారీలకు అడ్డాగా మారింది. లారీ మాటున అమాయకురాలిని నమ్మించి దురాఘతానికి పాల్పడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. పోలీసులు మాత్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల సీసీ కెమెరాలతో నిఘాను ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆదివారం తొండుపల్లి టోల్‌గేటు సమీపంలో రహదారి పక్కన నిలిపిన వాహనం ఆన్లైన్ విధానం అమలు చేస్తే.. సీసీ కెమెరాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేయాలంటే ఆన్లైన్ విధానం అమలులోకి రావాలి. ప్రస్తుతం ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యాలయాల్లో హార్డ్ డిస్క్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇక్కడే కెమెరాలను పర్యవేక్షించేందుకు స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే వీటి ద్వారా నేరాలకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. ఒక వేళ సీసీ కెమెరాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకొస్తే కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వీటిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వాహనాల పార్కింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశాలుంటాయి. ఇక రాత్రి వేళల్లో వాహనాల లైట్లు కెమెరాలకు నేరుగా తాకడంతో ఆధారాలను రికార్డు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి చోట్ల కెమెరాలను వేరే కోణాల్లో అమర్చుకోవాల్సి ఉంది. కెమెరాలను మార్చాలని నివేదిక పంపిస్తున్నాం.. హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని మార్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు హెచ్ఎండీఏ అధికారులకు సమాచారం ఇస్తున్నాం. శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కెమెరాల నిర్వహణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కానిస్టేబుల్‌ను నియమించాం. – వెంకటేష్, సీఐ, శంషాబాద్ -
ఆ.. ఘోరం జరిగింది ఇక్కడేనా!
సాక్షి, శంషాబాద్: ‘పాపం.. ఆ అమ్మాయిని ఇక్కడే హత్య చేశారు.. అయ్యో కొంచెం ధైర్యం చేసి రోడ్డుపైకి వస్తే ప్రాణాలు దక్కేవి.. పోలీసులు గస్తీ తిరిగి మృగాలను పసిగట్టినా ఘోరం జరగకపోయేది కదా..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. శంషాబాద్ మండలంలోని తొండుపల్లి టోల్‌గేటు వద్ద జస్టిస్ ఫర్ దిశ హత్యా సంఘటన ప్రాంతాన్ని సందర్శిస్తున్న జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి, ఔటర్ రింగురోడ్డు గుండా రాకపోకలు సాగించేవారితో పాటు స్థానికులు ఇక్కడ ఆగి ఘోర దుర్ఘటనను తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రాంతం వద్ద గుమికూడిన జనం పరిసరాలను పరిశీలించి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల రద్దీ, జన సంచారం ఉన్న ఇలాంటి చోట ఈ ఘటన జరగడం ఏమిటని మదన పడుతున్నా రు. ఎవరి నోట విన్నా.. అయ్యో ఎంత ఘో రం జరిగింది అనే మాట వినిపిస్తోంది. వారిలో ఆవేదన, ఆక్రోషం కనపడుతోంది. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన మాన వ మృగాలను కాల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మృత్యులారీ మింగేసింది
* రంగారెడ్డి జిల్లా తొండుపల్లి వద్ద ఘటన * ఇద్దరి దుర్మరణం * మూడు కార్లను, ఆటోను, బైక్‌ను ఢీకొట్టిన లారీ * ప్రమాదం ధాటికి దాని కింద ఇరుక్కుపోయిన ఆటో * విస్తరణ పనుల్లో జాప్యమే కారణం: స్థానికుల ధ్వజం శంషాబాద్ రూరల్: పేరుకు జాతీయ రహదారే అయినా అక్కడంతా కారుచీకటి. ఉన్నట్టుండి మృత్యుశకటమై దూసుకొచ్చిన ఓ లారీ, ఎదురొచ్చిన ప్రతి వాహనాన్నీ ఢీకొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లాలో బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలవగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న లారీ శంషాబాద్ మండలంలో తొండుపల్లి ఔటర్ జంక్షన్ వద్ద అదుపు తప్పింది. రోడ్డుపై వెళ్తున్న మూడు కార్లతో పాటు, ఓ ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. దాంతో కార్లు రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కకు దొర్లిపోయాయి. తర్వాత లారీ రోడ్డు పక్కనున్న గోతిలోకి వెళ్లి ఆగింది. ఆటో ఏకంగా లారీ కింద ఇరుక్కుపోవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి బైక్‌పై షాద్‌నగర్ వెళ్తున్న టోలిచౌకివాసి మహ్మద్ రఫీక్ (30), షాద్‌నగర్ నుంచి ఆటోలో శంషాబాద్ వస్తున్న హైమద్‌నగర్ వాసి మహ్మద్ షబీర్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. రఫీక్ వెంట ఉన్న మహ్మద్ నయీం (30), కార్లలో వెళ్తున్న మహబూబ్‌నగర్ వాసి మహ్మద్ జాఫర్ (55), పార్థసారథి (28), అతని కుమారుడు వరుణ్ (8), డ్రైవర్ సుదర్శన్‌రెడ్డి (40), కొత్తపేటకు చెందిన నికత్ (50), ఒవైసీ అలీ (55), నూరి (62), ఉజ్మా(17), ఆటోలో వెళ్తున్న శంషాబాద్ వాసి అస్లం (22) తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోను క్రేన్ సాయంతో లారీ కింద నుంచి తీసిన పోలీసులు మృతదేహాలను స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి, క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చీకట్లో రోదనలు ప్రమాద స్థలి వద్ద ఎలాంటి లైట్లూ లేకపోవడంతో ఏం జరిగిందో కొద్దిసేపటిదాకా అర్థం కాక ఇతర వాహనదారులు భీతిల్లారు. పైగా అక్కడ రోడ్డు బాగా ఇరుగ్గా ఉండటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంబులెన్స్‌లు కూడా అక్కడిదాకా రావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. లారీ కింద ఇరుక్కున్న వాహనాలను క్రేన్ సాయంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. వాటిలో ఎంతమంది ఉన్నదీ తెలియక, కనీసం ఐదారుగురికి పైగా మరణించి ఉంటారని తొలుత భావించారు. తొండుపల్లి వద్ద రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరగడమే ప్రమాదానికి కారణమంటూ మృతులు, క్షతగాత్రుల బంధువులు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో రోడ్డుపై ధర్నాకు దిగారు. దాంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి.