కరచాలనం కోసం 'క్యూ' కట్టారు!
లండన్: అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకునేందుకు భారత పారిశ్రామిక దిగ్గజాలు క్యూలో నిల్చున్న దృశ్యాలు గుర్తున్నాయిగా! సరిగ్గా ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అవుతోంది లండన్ లోని వెంబ్లే స్టేడియంలో. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న భారీ సభకు ముందు ఇంగ్లాండ్ లోని పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఒకొక్కరిగా ఆయనతో కరచాలనం చేశారు.
పద్ధతిగా క్యూలో వచ్చి భారత ప్రధానిని పలకరించారు. ఒకటి, రెండు మాటల్లో క్లుప్తంగా సాగిన సంభాషణ ద్వారా భారత్ లో పెట్టుబడులకు సిద్ధమనే తమ ఆకాంక్షను తెలియజేశారు. ఈ భేటీలో ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సహా పలువురు కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇంగ్లాండ్, భారత జాతీయగీతాల ఆలపనతో కార్యక్రమం ప్రారంభమైంది.