48 గంటల నుంచి కొనసాగుతున్న గాలింపు!
విశాఖపట్నం: విశాఖ తీరంలో గురువారం రాత్రి నీట మునిగిన తూర్పు నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక ఆచూకీ లభించలేదు. 48 గంటలుగా ఆ నౌక కోసం సముద్రంలో గాలిస్తూనే ఉన్నారు. నీటమునిగిపోయిన నలుగురి ఆచూకీ కూడా దొరకలేదు. గల్లంతైన నలుగురి సమాచారం నేవీ అధికారులు బయటకు తెలియజేయలేదు.
టార్పెడో రికవరీ వెసల్ ట్రావ్-72 అనే ఈ నౌక ప్రమాదవ శాత్తు గురువారం రాత్రి నీట మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. 23 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.
తీర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ముంచెత్తిన వరద కారణంగానే నౌక మునిగిపోయిందని అధికారులు తెలిపారు. విశాఖ తీరానికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. 1983లో గోవా షిప్‌యార్డులో తయారైన ఈ నౌక పొడవు 23 మీటర్లని, గడిచిన 31 ఏళ్లుగా సేవలందిస్తోందని పేర్కొన్నారు.
**