రూ.2.50 కోట్ల గంజాయి పట్టివేత
- తణుకు నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా
- పట్టుబడిన నిందితులు
- 165 బస్తాల గంజాయి, లారీ స్వాధీనం నలుగురి అరెస్ట్
తొర్రూరు : అక్రమంగా తరలిస్తున్న రూ.2.50 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన తొర్రూరు మండల సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై సుబ్బారెడ్డి కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా తణుకు నుంచి ఏపీ16టీఏ 0678 నంబర్ గల లారీలో అరటి పండ్ల గెలల మధ్య గం జాయి బస్తాలను ఖమ్మం వైపు నుంచి తొర్రూరు మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్సై సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున దుబ్బతండా సమీపంలో వాహనాలను తని ఖీ చేస్తుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీలో గంజారుు తరలిస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో తణుకు ప్రాంతానికి చెం దిన లారీ డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు సురేష్, సతీష్, దుర్గాప్రసాద్‌తోపాటు లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్ధార్ మేడిపె ల్లి సునీత సమక్షంలో పంచనామా చేయగా... మొత్తం 165 బస్తాలు ఉన్నారు.
ఒక్కో బస్తాలో రెండు కేజీల చొప్పున 12 ప్యాకెట్లతో 24 కేజీల గంజాయి ఉంది. సుమారు 4 టన్నుల గంజాయి ఉంది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తుండగా... మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్వో, పోలీసులు పాల్గొన్నారు.