toys Performance
-
బొమ్మా నిద్ర లేవమ్మా!
ప్రకాశం , కొనకనమిట్ల: ‘తోలుబొమ్మలాట చూడరో’ అంటూ సోగ్గాడు చేసే హంగామ ప్రజలను కడుపుబ్బ నవ్విస్తుంది. పూర్వం రోజుల్లో పల్లె ప్రాంతాల్లో తోలుబొమ్మలాట, బుడుగు జంఘాల హరికథలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలకు ఉత్సాహాన్ని నింపేయి. అప్పట్లో ఒక ఊపు ఊపిన తోలుబొమ్మలాట.. మూకీ చిత్రాలకు స్ఫూర్తినిచ్చే ప్రదర్శనలుగా భావించేవారు. గ్రామస్థాయిలో విశేష ఆదరణ పొందిన ఆట తోలుబొమ్మలాటగా చెప్పుకోవచ్చు. పూర్వం జమిందార్లు కళాకారులకు గ్రామాలను మాన్యంగా ఇచ్చేవారంటే తోలుబొమ్మలాటకు ఉన్న ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో పల్లె భాషలను ఉచ్ఛరిస్తూ కళాకారులు పాటలు పాడేవారు. తెరవెనుక ఉండి ఆహో, ఓహో అంటూ బొమ్మలను ఆడిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చేవారు. మగవారు పాడుతుంటే మహిళలు అనుబంధంగా పాడుతూ వారితో గొంతు కలిపేవారు. తోలుబొమ్మలాటలో ముఖ్యంగా ఆహుతులను నవ్వించే సోగ్గాడు పాత్ర మరింత కవ్వింతగా ఉంటుంది. సోగ్గాడు వేసే కామెడీ సన్నివేశాలు అప్పట్లో ప్రజలు పడిపడి నవ్వుకొనేవారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే నాటకం సన్నివేశాలను సోగ్గాడు తెరవెనుక నుండి క్లుప్తంగా వివరించేవాడు. నాటకంలోని పాత్రధారుల సన్ని వేశాలను తెరవెనుక ఉండి కళాకారులు బొమ్మలతో ఆడిస్తూ ఆటను కొనసాగించేవారు. కానీ ఇదంతా గతంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడా ఈ కళాకారులు కనిపిస్తూ కళను సజీవంగా నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడంతో అందమైన తోలుబొమ్మలు ఇక కనిపించకుండా పోయే ప్రమాదం నెలకొంది. మారిన కాలం ఒకప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను విశేషంగా ఆకట్టుకునే ఈ కళ ఇప్పుడు కళతప్పింది. ప్రస్తుతం కంప్యూటర్ యుగంతో పాతకాలపు ఆట, పాటలకు కళతప్పింది. సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల అభిరుచుల్లో వచ్చిన మార్పు ఆ కళ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందనే అనుకోవాలి. సినిమా వచ్చిన తరువాత ప్రాచీన కళలు కొన్ని కనుమరుగై కళాకారుల కడుపుకొట్టింది. కళలను నమ్ముకొని జీవించే కళాకారులు ప్రత్యామ్నాయ వృత్తులలోకి వెళ్లిపోయి జీవిస్తున్నారు. అయితే వారసత్వంగా వచ్చిన వృత్తిని వదులుకోలేక రంగం ఏదైనా కొంతమంది అదే వృత్తిని కొనసాగిస్తూ బతుకు బండిని లాగుతున్నారు. తోలుబ్మొలాట ప్రదర్శనలో సుమారు 15 మంది కళాకారులు ఉండేవారు. బొమ్మలాట కావ్య ఆలాపన, గ్రంథ వచనం, భావ వ్యక్తీకరణ, శృతి, లయ, మృదంగ కళాకారులతో పాటు హంగుదార్లు ఈ కళకు అవసరం. ప్రస్తుతం రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, సంస్థానాలు విలీనమయ్యాయి. వారితో పాటు ఈ కళ దాదాపు కనుమరుగైంది.. పూర్వం ఒక వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట కనుమరుగు కాకుండా కళాకారులు బతకాలంటే, కళలలకు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు ప్రాచీన కళలను ప్రోత్సహించటంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు చేయూత నివ్వాలి. అప్పుడే ఇలాంటి కళాకారులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. కళలను ప్రోత్సహించాలి, తోలుబొమ్మలాట కళాకారుడు ఇటీవల కొనకనమిట్ల మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అక్కడక్కడ తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శనలు ఇచ్చాడు. జిల్లాలోని బల్లికురవకు చెందిన వనపర్తి అంకారావు, మంగమ్మ దంపతులు వారి పిల్లలతో ఈ కళను ప్రదర్శిస్తూ ‘సాక్షి’తో తోలుబొమ్మలాట విశిష్టతను వివరించారు. ‘ మా పూర్వికులు పూర్వం నుంచి ఇదే కళను నమ్ముకొనే జీవించేవారు. ఇప్పటికి నేను నా భార్య మంగమ్మతో కలిసి కళను ప్రదర్శిస్తూ నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాన్నారు. పూర్వం కళను అవసోపన పట్టిందేకు ఎన్నో పాట్లు పడ్డాము. గత కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రదర్శనలు ఇచ్చాం. ప్రదర్శనలుకు మెచ్చిన పలువురు అవార్డులు, ప్రశంస పత్రాలు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్న ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లభించలేదు. రుణాలు కానీ, కళాకారుల పింఛన్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మాలాంటి కళాకారులు చాలామంది ప్రత్యామ్నాయంగా హరి కథలు, బుర్ర కథలు, చెక్క భజన, కోలాటం వైపు వెళ్లారు. మరికొంతమంది పౌరాణిక నాటకాలు ఆడుతున్నారు.అంకారావు, తోలుబొమ్మలాట కళాకారుడు -
ఎరుపెక్కిన విశాఖ
- వాడవాడల మేడే వేడుకలు - భారీ ర్యాలీలు, బహిరంగ సభలు - ఆకట్టుకున్న సీపీఎం బొమ్మల ప్రదర్శన విశాఖపట్నం(డాబాగార్డెన్స్): ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్లు, వీధుల్లో ఎర్రజెండాల తోరణాలు కట్టడడంతో అంతా ఎరుపుమయంగా కనిపించింది. దుకాణాలకు సెలవు దినం కావడంతో మేడే ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేశారు. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కార్మికులకు సంకెళ్లు-కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లా, ఆమ్ ఆద్మీ, కార్మికుడు-రైతు బొమ్మలతో సీపీఎం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు..నిర్భయ చట్టం ఎక్కడా? అంటూ ప్రదర్శించిన బొమ్మలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కేజీహెచ్‌లో: ఆంధ్రమెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా కేజీహెచ్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనరావు జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా శ్రమించి కేజీహెచ్‌ను అభివృద్ధిబాటలో నడిపిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూ ర్తి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్ఎంవో బంగారయ్య, ఎంప్లాయీస్ యూని యన్ అధ్యక్షుడు వై.త్రినాథ్, కార్యదర్శి టి.నాగరాజు, జె.డి.నాయుడు కార్మికులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో... కార్మిక చట్టాలపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల దాడిని తిప్పికొట్టాలని సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎ త్తున సీపీఎం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. డాల్ఫిన్ హోటల్స్ యూనియన్ ఆధ్వర్యంలో... డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించింది. హోటల్ ముందు యూనియన్ జెండాను గౌరవాధ్యక్షుడు వై.రాజు ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల పైబడి హోటల్లో పని చేస్తున్న సీనియర్ స్టాఫ్‌కు ఇప్పటికీ రూ.10 వేల జీతం కూడా అందకపోవడం దారుణమన్నారు. జీతం పెంచకపోగా గెస్ట్‌ల నుంచి వసూలు చేసిన సర్వీసు చార్జీలో ప్రతి నెలా యాజమాన్యం లక్షలాది రూపాయలు దిగమింగుతోందని ఆరోపించారు. 8 గంటల పనిదినం సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కె.అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు సిహెచ్.పాపారావు, కోశాధికారి ఎన్.కుమారస్వామి, సభ్యులు జి.ఆనంద్, బి.శ్రీనివాస్, టి.కృష్ణ, టి.సోమినాయుడు, సన్యాసిరావు పాల్గొన్నారు. వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. మే డేను పురస్కరించుకొని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రణాళికలో 8 జోనల్ పెండింగ్ కమిటీలను ఒకటిగా ఏర్పాటు చేసి ప్రతి వీధి విక్రయదారునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఉన్న ఆటోస్టాండ్ వద్ద మే డేను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.