టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలి
టీపీఎస్సీ చైర్మన్‌కు టీపీఆర్టీయూ వినతి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలని టీ పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణికి పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వారిజీవితాలు స్థిరపడే విధంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు. లక్షమంది ఉద్యోగుల పదోన్నతులకు ఉపయోగపడే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని, టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు.
గతంలో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు, తప్పులు జరిగాయాయని, అలాంటివాటికి తావుతావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చలపతిరావు, నరేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.