ఆటో దొంగల అరెస్ట్
కర్నూలు : బళ్లారి రోడ్‌లోని మహేంద్ర ట్రాక్టర్స్ షోరూమ్‌లో ఆటోలను చోరీ చేసి తప్పించుకొని తిరుగుతున్న దొంగలను నాల్గవ పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కర్నూలు పట్టణానికి చెందిన షేక్‌నూర్ అహ్మద్, పింజరి బాబు, పింజరి లతీఫ్‌ఖాన్, ఎండీ మహమ్మద్‌బాషా తదితరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7 లక్షలు విలువ చేసే నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగరాజురావు తెలిపారు. దొంగలను కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు.