ట్రాక్టర్ బోల్తా, రైతు మృతి
ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో కోసిన పసుపు పంటను రైతు మెంటి సాయన్న(38) కళ్లం దగ్గరకు తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో రైతు మెంటి సాయన్న మృతిచెందాడు. రైతు సాయన్నకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.