మెట్రో ఎఫెక్ట్: రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
మెట్రో రైలు పనుల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దిల్సుఖ్నగర్ నుంచి కోఠి వెళ్లే వాహనాలను మూసారాం బాగ్ వద్ద మళ్లించారు. అలాగే ఎంజీబీఎస్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలను చాదర్ఘాట్ సమీపంలో దారి మళ్లించారు.
ఈనెల 13వ తేదీ శనివారం నుంచి రెండు నెలల పాటు చాదర్ఘాట్ నుంచి మలక్పేట వరకు తిరిగే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మెట్రోరైలు పనులను ఆ ప్రాంతంలో ముమ్మరంగా చేపట్టాల్సిన కారణంగా ఈ మార్పుచేర్పులు చేశారు.