Tragic story
-
రాయల్ లైఫ్, అంబానీ కంటే రిచ్ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!
కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపారం కుటుంబం రేమాండ్ గ్రూపు. భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్ అనే బ్రాండ్‌ను, దానికొక ఇమేజ్ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్ టెక్స్టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. "ది కంప్లీట్ మ్యాన్", "ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్" ట్యాగ్‌లైన్‌లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే. రూ.1200 కోట్ల సామ్రాజ్యం ప్రఖ్యాత ఏవియేటర్, సర్క్యూట్ రేసింగ్ లవర్ , సాహస క్రీడల ప్రేమికుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్‌పథ్ కొడుకు గౌతం సింఘానియా విబేధాలతో ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో అంబానీలకు (రేమండ్ గ్రూప్ యజమానిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా చిన్నవాడు) మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు. మానవ సంబంధాలు, కుటుంబంలోని కుటుంబ వివాదాల దుష్పరిణామాలకు రేమండ్ వ్యవహారం, ఒక రిమైండర్.. ఒక హెచ్చరిక లాంటిది . 1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమై రేమండ్ అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విమానయానంలో అతని విజయాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఆఫ్ హానర్ , లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కోసం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. విజయ్‌పత్ పెద్ద కుమారుడు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్‌లో స్థిరపడ్డాడు. రేమాండ్ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్‌తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది. సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే గౌతమ్ భార్య నవాజ్‌మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన ప్రియమైన బిడ్డలు, గోప్యత అంటూ గౌతమ్ మౌనంగా తెరవెనుక ఉండిపోతుండగా, అతని భార్య నవాజ్మాత్రం తనను హింసించాడని ఆరోపించింది. గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్ చేస్తోంది. 2015 ఫిబ్రవరి 15 నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. నాజీవితాన్ని శాశ్వతంగా మార్చేసే లేఖంపై సంతకం చేసిన రోజు. నా జీవితంలో చేసిన అత్యంత మూర్ఖపు తప్పు - విజయ్‌పత్ సింఘానియా రేమాండ్ కుప్పకూలుతోంది.. నా గుండె బద్దలవుతోంది ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్‌కు బదులుగా నవాజ్‌కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం. తన కుమారుడు గౌతమ్ కంపెనీని నాశనం చేస్తున్నాడని, ఇది చూసి తన గుండె బద్దలవుతోందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చివేయడం బాధకలిగిస్తోందన్నారు. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త సంపదలో సగం స్వయంచాలకంగా విడిపోయిన భార్యకు వెళ్తుంది. మరి నవాజ్ 75 శాతం కోసం ఎందుకు పోరాడుతోందని అనేది తనకు అర్థం కాలేదని కానీ ? గౌతమ్ లొంగడని వ్యాఖ్యానించారు. విడాకుల వివాదంతో భారీ నష్టం రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్ స్టాక్‌గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది. -
Mystery: లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ..
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు. దాదాపు 93 ఏళ్ల క్రితం జరిగిన.. ‘లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ’ చదివితే.. తోటి మనిషిపైన, రేపటి రోజుపైన క్షణకాలం పాటు నమ్మకం సడలుతుంది. \అది 1929, డిసెంబర్ 25 మధ్యాహ్నం.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని జర్మన్టన్లో ప్రజలు క్రిస్మస్ సంబరాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఉన్నట్టుండి చార్లెస్ డేవిస్ లాసన్ అనే పొగాకు రైతు ఇంట్లో వరుసగా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఊరు ఊరంతా అటు పరుగుతీసింది. ఇంటినిండా ఛిద్రమైన శవాలు. రక్తపు చారలు. పెనుగులాడిన ఆనవాళ్లు. వంట గదిలోని క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పోలీసులు, ప్రజలు చుట్టుపక్కలంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కొన్ని గంటల తర్వాత పక్కనే ఉన్న అడవిలోంచి మరో తుపాకీ గుండు పేలిన శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే చార్లెస్ శవమై ఉన్నాడు. చార్లెస్ డేవిస్ లాసన్.. నార్త్ కరోలినాలోని లాస¯Œ విల్లేలో 1886, మే 10న జన్మించాడు. 1911లో ఫెన్నీ మాన్రింగ్తో పెళ్లి తర్వాత జర్మన్టన్లో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల కాపురంలో ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అయితే మూడో సంతానమైన విలియం 1920లో అనారోగ్యంతో చనిపోయాడు. 1927 నాటికి ఆర్థికంగా బలపడిన చార్లెస్ కుటుంబం.. బ్రూక్ కోవ్ రోడ్లో సొంత పొలాన్ని కొనడానికి సరిపడా డబ్బులు పోగు చేసుకుంది. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయంలో.. 1929 డిసెంబర్ 25 ఉదయాన్నే కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని పట్టణం వెళ్లాడు చార్లెస్(43). పండుగ పేరుతో భార్యబిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. నిజానికి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అవన్నీ అతి ఖరీదైన దుస్తులు. ఆ తర్వాత అంతా కలిసి ఒక గ్రూప్ ఫొటో కూడా దిగారు. అదే ఆ కుటుంబానికి చివరి ఫొటోగా మిగిలింది. ఇంటికి వచ్చాక చార్లెస్ తన పెద్దకొడుకు ఆర్థర్(17)తో కలిసి.. సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ బుల్లెట్స్ అన్నీ అయిపోవడంతో.. వాటిని కొని తెమ్మని ఆర్థర్ని పట్టణానికి పంపించి.. ఇంట్లో మారణహోమానికి సిద్ధమయ్యాడు చార్లెస్. తన కుమార్తెలు క్యారీ(12), మేబెల్(7)లు మేనత్త ఇంటికి వెళ్లిరాగానే.. తుపాకీ గుళ్లతో విరుచుకుపడ్డాడు. ముందుగా క్యారీ, మేబెల్లను కాల్చి చంపి.. పొగాకు కుప్పల పక్కన దాచిపెట్టాడు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న భార్యపై(37) కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కొడుకులు జేమ్స్(4), రేమండ్(2)లను, వారిని కాపాడటానికి ప్రయత్నించిన పెద్ద కూతురు మేరీ(16)నీ చంపేశాడు. చివరికి మూడు నెలల పసి బిడ్డ మెర్రీ లూని కూడా విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా నేలకేసి కొట్టికొట్టి కడతేర్చాడు. అయితే పెద్దకొడుకు ఆర్థర్ని తనంతట తానే ఎందుకు వదిలిపెట్టాడనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఆర్థర్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు శ్మశానంగా మారిపోయింది. అడవిలో ఆత్మహత్య చేసుకున్న చార్లెస్ జేబులో ఏవో రెండు లేఖలు దొరికాయి. అయితే అందులో తన తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తప్ప.. వీళ్లందరినీ ఎందుకు చంపాడనే వివరం లేదు. ఈ దుర్ఘటనపై చాలా ఊహాగానాలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే ఈ కేసుపై ఆసక్తి చూపించినవారిని సమాధానపరచాయి. ఈ ఘటన జరడగానికి సరిగ్గా నెల రోజుల ముందు చార్లెస్ తలకి బలమైన దెబ్బ తగిలిందని, మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అలా హత్యలకు పాల్పడి ఉంటాడని కొందరు వాదించారు. అయితే చార్లెస్ మెదడుపై చేసిన వైద్య పరీక్షల్లో అలాంటి తేడాలేం గుర్తించలేదు. మరొక కథనం అతి ఘోరమైనది. చార్లెస్ తన పెద్ద కుమార్తె మేరీతో అనుచిత సంబంధం కలిగి ఉన్నాడని.. అతడి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని, అందుకు సాక్ష్యం.. కుటుంబమంతా ఉన్న ఆ చివరి ఫొటోనే అని, అందులో మేరీని గమినిస్తే తను కడుపుతో ఉందన్న విషయం స్పష్టమవుతుందని, ఆ నిజం ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే కుటుంబం మొత్తాన్ని చార్లెస్ చంపేశాడనేది మరి కొందరి వాదన. మేరీ గర్భవతన్న విషయం.. తమతో మేరీ తల్లి ఫెన్నీ చెప్పిందని, చార్లెస్, మేరీల ప్రవర్తనపై ఆమె ఆందోళనగా ఉండేదని.. బంధువుల్లో, స్నేహితుల్లో కొందరు సాక్షులుగా ముందుకొచ్చారు. వారితో అలా ఎవరైనా చెప్పించారా అనేది కూడా ప్రశ్నే. పైగా, మేరీ గర్భవతని నిర్ధారించే వైద్యపరమైన ఏ అధికారిక నివేదికా రాలేదు. ఇది ఇలా ఉండగా.. చార్లెస్సే హత్యలు చేశాడనడానికి బలమైన కారణాలుగా అదే రోజు భార్యబిడ్డలకు ఖరీదైన దుస్తులు కొనివ్వడం, వారితో కలిసి ఫొటోదిగడం.. ఇవేమీ యాదృచ్ఛికం కాదంటారు చాలా మంది. పథకం ప్రకారమే చార్లెస్ తన కుటుంబాన్ని కడతేర్చాడు అనేది వారి వాదన. మరోవైపు.. చార్లెస్‌కి ఏ పాపం తెలియదని, చార్లెస్‌తో సహా ఆ కుటుంబాన్ని మొత్తం ఎవరో చంపేసి ఇలా చిత్రీకరించి ఉంటారనేది ఇంకో కోణం. మొత్తానికి ప్రాణాలతో మిగిలిన చార్లెస్ పెద్ద కొడుకు ఆర్థర్ లాసన్ ఏకాకిగా పెరిగి, పెద్దయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. ఏవో ఆస్తి తగాదాల్లో తన భూమిని కూడా కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని 32వ ఏట 1945లో కారు ప్రమాదంలో చనిపోయాడు. నార్త్ కరోలినా, మాడిస¯Œ లోని ‘మాడిసన్ డ్రై గూడ్స్ కంట్రీ స్టోర్’లో చార్లెస్ లాసన్ కుటుంబానికి గుర్తుగా ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇప్పటికీ ఈ భయంకరమైన విషాదాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఆ మ్యూజియానికి వస్తుంటారు. ఆ రోజు ఎవరూ తినకుండా మిగిలిపోయిన చార్లెస్ ఇంట్లోని క్రిస్మస్ కేక్‌ని కూడా కొన్నాళ్లపాటు ప్రజల సందర్శనకు ఉంచారు. చివరికి లాసన్ బంధువుల్లో ఒకరు గొయ్యితీసి దాన్ని పూడ్చేశారు. ఈ ఉదంతాన్ని కథనాంశంగా తీసుకుని ఎన్నో పుస్తకాలు, సిరీస్, కథలు ఇలా చాలానే వచ్చాయి. అయితే చార్లెస్ నిజంగానే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఈ కుట్రకు పాల్పడి, చార్లెస్‌ని ఇరికించారా? అనేది నేటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఒక ఘోరమైన నిందతోనే ఈ కుటుంబ కథ ముగిసింది. ∙సంహిత నిమ్మన -
విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో?
సాక్షి, తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన షరాఫు పిలాసేరీ (35)విషాధ గాథ కంటి తడిపెట్టిస్తోంది. ముద్దులొలికే చిన్నారి, భార్యతో కలిసి ఎంతో ఉద్వేగంగా స్వదేశానికి బయలుదేరిన షరాఫు రాబోయే మృత్యువును ముందే ఊహించారా. ఆయన సిక్స్త్ సెన్స్ ఇలాంటి వార్నింగ్ ఇచ్చిందా? షరాఫు ప్రాణ స్నేహితుడు ఈ అనుమానాల్నే వ్యక్తం చేశారు. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు) కోళీకోడ్‌లోని కున్నమంగళానికి చెందిన షరాపు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో అత్యవసరంగా భార్య అమీనా షెరిన్, కుమార్తె ఇసా ఫాతిమాతో కలిసి స్వదేశానికి పయనమయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకున్న ఈ యువ దంపతులు "బ్యాక్ టూ హోం'' అంటూ ఒక సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తలచుకుని దుబాయ్ లో ఒక హోటల్ నడుపుతున్న షరాఫు స్నేహితుడు షఫీ పరక్కులం కన్నీటి పర్యంతమయ్యారు. ఇండియాకు వెళ్లేముందు తనను కలిసిన స్నేహితుడి జ్ఙాపకాలను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. (ఆయన ధైర్యమే కాపాడింది!) "కేరళకు బయలుదేరే ముందు, వీడ్కోలు చెప్పడానికి నా హోటల్‌కు వచ్చాడు. కొంచెం కలతగా కనిపించాడు. ఎందుకో నాకు టెన్షన్ అనిపిస్తోంది..అన్నాడు. అంతేకాదు ఈ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయమని, వారికి అన్న పెట్టాలంటూ కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇదంతా గమనిస్తోంటే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...ఇదొక సూచనా అని అనిపిస్తోంది'' అని ఫేస్ బుక్ పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. షరాఫు గతంలో మహమ్మారి సమయంలో కూడా పేదలకు డబ్బులిచ్చాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా కన్నవారిని కలుసుకోవాలన్నకోరిక తీరకుండానే..తన పసిబిడ్డ బోసినవ్వులను శాశ్వతంగా వీడి మృత్యువు ఒడికి చేరడం బంధువుల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. కాగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో షరాఫు బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య అమీనా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, కుమార్తె ప్రస్తుతం కోళీకోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. -
హిందూ సంస్థల శౌర్య దివస్.. ముస్లింల విషాద దినం
అయోధ్య / లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ ‘శౌర్య దివస్’ పేరిట సంబరాలు నిర్వహించగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వంటి ముస్లిం సంస్థలు ‘విషాద దినం’గా పాటించాయి. అయోధ్యతో పాటు ఫైజాబాద్‌లో భారీసంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. వీహెచ్‌పీ ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సంబరాలు నిర్వహించింది. మందిరం నిర్మాణానికి ప్రస్తుతం దేశంలో పరిస్థితి అనుకూలంగా ఉందని శ్రీరామ్ జన్మభూమి న్యాస్ చైర్మన్ మహంత్ గోపాల్‌దాస్ చెప్పారు. బాబ్రీ కూల్చివేత ఘటనలో లిబర్హాన్ కమిషన్ దోషులుగా తేల్చిన వారందరికీ కఠిన శిక్ష విధించాలని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు రషీద్ డిమాండ్ చేశారు. -
చైనాలో రాక్షస జాతి మనుషులున్నారా?
బీజింగ్: పైకి చూడ్డానికి గుండ్రటి ముఖం.. అతడి తలపై వెంట్రుకలు అక్కడక్కడా ఊడిపోయి ఈకలుగా మారిన తల.. పెదవులు మూసి చిరునవ్వుతో ముఖంలోకి ముఖంపెట్టి చూశాడు. అతడికి పెద్దగా నవ్వాలనిపించి నోరు తెరిచాడు.. అంతే గుండెలు జారీపోయాయి. ఎందుకంటే అతడు డ్రాకులా లాంటి మనిషి. రక్తాన్ని తాగి బతికే డ్రాకులాల మాదిరిగా అతడికి కూడా రెండే పళ్లు. అవి కూడా ఎంతో వాడిగా ఉండే కోరటి పళ్లు. అయితే, వాస్తవానికి అతడు డ్రాకులా కాదు. అతడిని చూసినవారంతా రాక్షసి జాతి అని భయపడిపోతారంతే.. ఫలితంగా 15 ఏళ్లు పూర్తయినా అతడు ఇంట్లోనే ఎక్కువగా పరిమితమై ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా తనలో తానే కుమిలిపోతున్నాడు. పాఠశాలకు వెళ్లినా తోటి విద్యార్థులు నిత్యం హేళన చేస్తుంటారు. అవును ఇది దురదృష్టవశాత్తు ఎవరికీ రాని జబ్బుతో బాధపడుతున్న ఓ చైనాకు చెందిన కుర్రాడి వ్యధ. అతడి బంధువులు కూడా ఈ వ్యాధితో బాధపడుతుండగా వారిది రాక్షస సంతతి అంటూ చుట్టుపక్కలపక్కల వారు వేధిస్తున్నారు. అయితే, వారు వాస్తవానికి బాధపడుతున్నది 'ఎక్టోడర్మల్ డిస్ప్లాసియా' అనే వ్యాధితో. అత్యంత అరుధుగా ఎవరో ఒకరికి వచ్చే ఈ వ్యాధి సోకిన వారిలో విపరీతమైన మార్పులు వస్తాయి. అలాగే, పాంగ్ బాయ్‌గా పిలిచే లాన్ హాయ్ అనే పదిహేనేళ్ల చైనా బాలుడిపై కూడా ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2001లో తొలిసారి అతడి తల్లి ఈ విషయం తెలిసి దిగ్బ్రాంతికి లోనైంది. ఎన్నో ఆస్పత్రులు తిప్పింది కానీ ఫలితం మాత్రం రాలేదు. కాల క్రమంలో అతడికి జుట్టు ఊడింది. చేతి వేళ్ల గోర్లలో మార్పులు వచ్చాయి. కనుబొమ్మల్లో కూడా తేడా వచ్చింది. దీంతోపాటు వారు ఎక్కువగా వెళుతురులోకి కూడా రాలేరు. ఇలాంటి లక్షణాలన్నీ సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో చూపించే డ్రాకులాలకు ఉంటాయి. అందికి వీరిది రాక్షస జాతి అని పలువురు తిడుతుంటారు. అతడికి తాజాగా వైద్యం కోసం చాంగింగ్ లోని థర్డ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ కి తల్లి మా యాంగ్జు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రిపోర్టర్లు ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగుచూశాయి.