‘ఆధునికత’పై అవగాహన
కరీంనగర్ : రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ నీతూప్రసాద్ చెప్పారు. అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పాలకమండలి సమావేశం గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మ బడ్జెట్‌ను శిక్షణకే కాకుండా రైతుల ఆస్తుల కల్పనకు ఉపయోగించాలన్నారు. కూరగాయల సాగు, ఉద్యానవన సాగులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో శిక్షణ ఇప్పించాలని తెలిపారు. వ్యవసాయశాఖ పనులకు ఆత్మబడ్జెట్ను వృథా చేయొద్దన్నారు.
డివిజన్స్థారుుల్లో పెద్ద ఎత్తున కిసాన్మేళాలతో అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖలు, వ్యవసాయ యంత్రాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ మేళాలో పాల్గొనాలని అన్నారు. విత్తనోత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాలని, నూతన చైర్మన్లకు ఆత్మపై అవగాహనకు వర్క్‌షాప్ నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఛత్రునాయక్, పశుసంవర్ధకశాఖ జేడీ, ఆత్మ కమిటీ ప్రాంతీయ చైర్మన్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇందిర జలప్రభ పనులు వేగవంతం చేయండి
ఇందిర జలప్రభ పథకం పనులను వేగవంతం చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ డ్వామా ఏపీవోలను ఆదేశించారు. ఇందిర జలప్రభపై గురువారం సమీక్షించారు. జిల్లాకు 15,474 ఎకరాలను లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు, ఏపీవోలు సమన్వయంతో పనిచేసి అన్ని బోరుబావులకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తేవాలన్నారు. ఈ పథకంపై డ్వామా పీడీ ప్రతీవారం సమీక్షించాలని సూచించారు. రైతులకు డిమాండ్ ప్రకారం బోరుబావులు కాని, ఓపెన్ వెల్స్ కాని మంజూరు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ గణేశ్, ఏపీవోలు పాల్గొన్నారు.
చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రోత్సహించండి
చేనేత వస్త్రాల విక్రయూలను ప్రోత్సహించాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రజలను కోరారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను గురువారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. చేనేత వస్త్రాలు వేసవిలో ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. 26 వరకు వస్త్రప్రదర్శన కొనసాగుతుందన్నారు.
కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, పోచంపల్లి, గద్వాలతోపాటు 40 చేనేత సహకార సంఘాలు రూపొందించిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ వీవీ.రమణామూర్తి, చేనేత జౌళిశాఖ డెరైక్టర్ ప్రీతిమీనా, జిల్లా సహాయ సంచాలకులు ఎం.వెంకటేశం, రఘురాంభూపాల్, చేనేత జౌళిశాఖ, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.