ఎస్సైల బదిలీలు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల కాలంలో ఎస్సైల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా బుధవారం 38 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు ఆరు నెలలుగా జిల్లాలోని వివిధ ఠాణాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది ఎస్సైలకు నూతనంగా పోస్టింగ్ కల్పించారు.