ఏసీబీకి చిక్కిన మరో ఉద్యోగి
రిటైర్డ్ ప్రిన్సిపాల్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్
వరంగల్ : జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగి పింఛను కు సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపేం దుకు లంచం డిమాండ్ చేసిన కార్యాల య సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. కరీనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని మహిళా జూని యర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వి.విజయమారుతి ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ పొందారు. ఆయన తన పింఛను మంజూరు కోసం హన్మకొండ సుబేదారిలోని ఆర్జేడీ కార్యాలయంలోని సూపరింటెం డెంట్ వీరంరాజును సంప్రదించారు. ఫైల్‌ను హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీస్ కు పంపేందుకు వీరంరాజు రూ.10 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆరు నెలలుగా తిరిగి విసిగిపోయిన విజయమారుతి మొదటి విడతగా రూ.4 వేల నగదు ముట్టజెప్పాడు. నగ దు ముట్టిన వెంటనే ఫైల్‌ను ఆర్జేడీకి పంపగా ఆయన దానిని ఆమోదించా రు. ఆ ఫైల్‌ను ఏజీ కార్యాలయానికి పంపకుండా తన దగ్గరే పెట్టుకున్న వీరంరాజు మిగి లిన డబ్బులు ఇస్తేనే పంపిస్తానని చెప్పాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయమారుతి ఏసీబీ అధికారులను అశ్రయించారు. బుధవారం సూపరింటెండెంట్ వీరంరాజుకు మిగతా రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నామని సాయిబాబా తెలిపారు.