మూడు రాష్ట్రాలకు కొత్త సీజేలు
న్యూఢిల్లీ: ఛత్తీస్ గఢ్, త్రిపుర, రాజస్థాన్ లకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటన
విడుదల చేసింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న టిన్ లియాతంగ్ వైపీ ని త్రిపురకు బదిలీ చేశారు. ఛత్తీస్ గఢ్
న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ కుమార్ గుప్తాను నియమించారు.ఛత్తీస్ గఢ్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నవీన్ సిన్హాను రాజస్థాన్ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు.
ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వేద ప్రకాశ్ వైశ్ ను మేఘాలయకు,మద్రాసు సీజే సతీష్ కుమార్ అగ్నిహోత్రిని సిక్కింకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటన పేర్కొంది. వీరందరినీ మే23 లోపు బాధ్యతలు స్వీకరించవలసిందిగా రాష్ట్రపతి ఆదేశించారు.త్రిపుర మణిపూర్,మేఘాలయల్లో 2013లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఇవి గౌహతి హైకోర్టు పరిధిలో ఉండేవి.అవస్థాపనా సౌకర్యాల అనంతరం మిజోరాం, నాగాలాండ్,అరుణాచల్ ప్రదేశ్ లలో హైకోర్టును ఏర్పాటు చేయబోతున్నట్లు కూడాప్రకటన తెలిపింది.