మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం..
గౌహతిః మయన్మార్-భారత్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం గం. 7.11 నిమిషాలకు రిక్టల్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5 గా నమోదైంది. భూకంపం కారణంగా ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం అధికారికంగా నమోదు కాలేదని భారత మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండి) ధృవీకరించింది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఉదయం గం. 5.30 నిమిషాలకు రిక్టల్ స్కేలుపై 3.1 తీవ్రతతో తేలికపాటి ప్రకంపనలు సంభవించినట్లు ఐఎండి వెల్లడించింది.