పెప్పర్ సాల్ట్‌గా అజిత్
నటుడు అజిత్ రూటే సెపరేటు. సహజత్వానికి ప్రాముఖ్యతనిచ్చే నటు ల్లో ఈయన ఒకరు. ఆరంభం, వీరం చిత్రాల్లో వయసుకు తగ్గ పాత్రలు ధరించి తన అభిమానులకు కొత్త అనుభవాన్నిచ్చిన అజిత్ తాజా చిత్రంలో పెప్పర్ సాల్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనతో అందాల భామలు అనుష్క, త్రిష రొమాన్స్ చేస్తున్నారు. అనుష్కతో కొన్ని సన్నివేశాల్లో మెరిసిన జుత్తుతోను, మరికొన్ని సన్నివేశాల్లో డ్రై వేసుకున్న జుత్తుతో నూ నవ మన్మథుడిలా కనిపించనున్నారని తెలిసింది. అదేవిధంగా ఫ్లాష్‌బ్యాక్‌లో త్రిషతో మరిం త స్టయిలిష్‌గా కనిపించనున్నారట.
మొత్తం మీద ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు వెరైటీ చూపించనున్నారన్నమాట. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట నవంబర్‌లో విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. అయితే చిత్రానికి హరీష్ జయరాజ్ అతి నవీన సాంకేతిక టెక్నాలజీతో సంగీతాన్ని అందిస్తున్నారట. దీంతో ఆయనకు అధిక సమయం కావలసి రావడంతో చిత్రాన్ని జనవరికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఇంతకుముందు అజిత్ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సెంటిమెంట్‌తో ఈ తాజా చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.