Triton
-
టెస్లా కంటే తోపు..! ఇప్పుడు హైదరాబాద్‌లో...
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్ తెలంగాణలోని తన రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ట్రిటాన్ ఎలక్ట్రిక్ కార్లు టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. ట్రిటాన్ తన తొలి ఉత్పత్తి కర్మాగారాన్ని మహారాష్ట్రలోని పుణేలో ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌లో ఫస్ట్ ప్రివ్యూ...! టెస్లా కంటే ముందుగానే అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ట్రిటాన్ తెలంగాణ కేంద్రంగా తన రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా ట్రిటాన్ సంస్థ యాజమాన్యం హైదరాబాద్‌లో తొలిసారిగా ట్రిటాన్ హెచ్ మోడల్ ఎస్యూవీను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ట్రిటాన్ సంస్థ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్, మాన్సుర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..! ట్రిటాన్ తన రెండో ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటుచేసి కంపెనీ మరొక కీలక రాయిని చేరుకుందని జయేష్ రంజన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ట్రిటాన్ తెలంగాణలో తన రెండో కర్మాగారాన్ని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) జహీరాబాద్ వద్ద ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రిటాన్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమిని కూడా కేటాయించింది. అక్టోబర్ 7 న ట్రిటాన్ సంస్థ యాజమాన్యం ప్రభుత్వం కేటాయించిన ల్యాండ్‌ను సందర్శించింది. ఝరాసంగం మండలంలోని యెల్గోయ్ గ్రామానికి సమీపంలో ట్రిటాన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ కోసం సుమారు రూ .2,100 కోట్లతో పెట్టుబడి పెట్టబోతోంది. ట్రిటాన్ ది సూపర్ ఎస్యూవీ...! సాధారణ ఎస్యూవీ కార్ల కంటే ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ మోడల్ ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏడు కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ మోడల్‌ను సూపర్ ఎస్‌యూవీగా పేర్కొన్నారు. ట్రిటాన్ ఇంజన్ విషయానికి వస్తే...! ట్రిటాన్ మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కారులో 200kWh బ్యాటరీను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 1120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హైపర్ ఛార్జింగ్ సహాయంతో కేవలం రెండు గంటల్లోనే బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కారు 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుంది. కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ను ఏర్పాటుచేశారు. Another milestone for @realtritonev in its journey in Telangana …preview of their very sleek and amazing Model H in Hyderabad..congratulations Mr Himanshu Patel, Mr Mansoor and rest of the team pic.twitter.com/wFGoEPUwLO — Jayesh Ranjan (@jayesh_ranjan) October 9, 2021 చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. -
టెస్లా కంటే తోపు...! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..!
Triton Model H Electric SUV Leaked: టెస్లాకు పోటీగా భారత మార్కెట్లలోకి అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్ సిద్ధమైంది. భారత మార్కెట్లలోకి ట్రిటాన్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ వాహనాన్ని త్వరలోనే రిలీజ్ చేయనుంది. టెస్లా కంటే ముందుగానే..! టెసాల కంటే ముందుగానే అమెరికాన్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ట్రిటాన్ ‘ది ట్రిటాన్ హెచ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్‌ను భారత మార్కెట్లలోకి వచ్చే వారం లాంచ్ చేయనుంది. తాజాగా ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ మోడల్ కార్ ఫోటోలను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఏడాది మేలో మోడల్ హెచ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ప్రీ-బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. అమెరికాలో ట్రిటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టెస్లాకు గట్టిపోటీని ఇస్తుంది. అంతేకాకుండా ట్రిటాన్ త్వరలోనే ఐపీవోకు వెళ్లాలని యోచిస్తోంది. చదవండి: ఫేస్బుక్ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ! ట్రిటాన్ ది సూపర్ ఎస్యూవీ...! సాధారణ ఎస్యూవీ కార్ల కంటే ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ మోడల్ ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏడు కలర్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ మోడల్‌ను సూపర్ ఎస్‌యూవీగా పేర్కొన్నారు. ట్రిటాన్ ఇంజన్ విషయానికి వస్తే...! ట్రిటాన్ మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కారులో 200kWh బ్యాటరీను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 1120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హైపర్ ఛార్జింగ్ సహాయంతో కేవలం రెండు గంటల్లోనే బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కారు 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుంది. కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ను ఏర్పాటుచేశారు. తొలుత 100 కార్ల డెలివరీ..! మహారాష్ట్రలోని పూణేలో ట్రిటాన్ తొలి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కర్మాగారం మొదటి ఆరు నెలల్లో 100 కార్లను తయారీ చేయనుంది. భారత్‌లో 1000 కార్ల కోసం ముందస్తు బుకింగ్ ప్రారంభిస్తామని హిమాన్షు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా లో ట్రిటాన్ హెచ్ ఎస్యూవీ ధర సుమారు రూ. 1.05 కోట్లుగా ఉంది. అయితే భారత్‌లో ఈ మోడల్ అమెరికా కంటే అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్ హామీ ఇచ్చారు. చదవండి: నిన్న ఫేస్బుక్...నేడు.. అసలు ఏం జరుగుతోంది...! -
గాల్లో తేలినట్టుందే ...
విమానంలో వెళ్తున్నప్పుడు ప్రయాణికుల సీటులో కూర్చుని బుల్లి కిటికీలోంచి బయటకు చూస్తే.. వచ్చే అనుభూతి వేరు. మేఘాలు.. అంతా చిన్నచిన్నగా కనిపించడం.. తొలిసారి విమానం ఎక్కినోళ్లయితే.. చిన్నపిల్లల్లా సంబరపడిపోతారు. అదే పెలైట్ సీటులో కూర్చునే చాన్స్ ఇస్తేనే.. అక్కడ్నుంచి వ్యూ అదిరిపోదూ.. ట్రిటాన్ అనే ఈ విమానమొక్కితే.. అలాంటి అరుదైన అనుభూతి మన సొంతమవుతుంది. ఈ విమానానికి రెండు వైపులా రెండు అదనపు క్యాబిన్లలాంటివి ఉంటాయి. ఒక్కోదానిలో ఐదుగురు వరకూ కూర్చోవచ్చు. వాటిల్లో కూర్చుంటే పైలట్ సీటులో కూర్చున్నట్లు ఉంటుందని.. అన్ని వైపులా అద్దాలే ఉండటంతో అద్భుతమైన అనుభూతి మీ సొంతమవుతుందని దీని డిజైనర్ అమెరికాకు చెందిన మైక్రోనాటిక్స్ సంస్థ చెబుతోంది. ప్రపంచంలో పేరొందిన పర్యాటక ప్రాంతాల మీదుగా దీన్ని నడపనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఈ విమానం తయారీ, ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది.