Trojan
-
ఎనర్జీ సంస్థ ప్రచారకర్తగా మహేశ్ బాబు
హైదరాబాద్: సోలార్ ఎనర్జీ సెక్టార్‌లోని సన్‌టెక్ ఎనర్జీ బ్రాండ్ ‘ట్రూజన్ సోలార్’కు సినీనటుడు మహేశ్‌బాబు ప్రచారకర్తగా నియమితులయ్యారు. రూఫ్టాఫ్ సోలార్ ఇన్స్టలేషన్లో 2025 మార్చి నాటికి భారత్‌లో అగ్రగామిగా నిలిచేందుకు కట్టుబడి ఉన్నామని సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకులు, ఎండీ, సీ.హెచ్. భవానీసురేశ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని మహేశ్‌బాబు తెలిపారు. -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! కొత్తగా..
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోకి ప్లైట్రాప్ అనే ట్రోజాన్(పలు సైట్ల నకిలీ రూపం) ఫేస్బుక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రోజన్ వల్ల ఇప్పటివరకు భారత్‌తో కలిపి 144 దేశాలలో పదివేల మంది ఆండ్రాయిడ్ యూజర్లను ప్రభావితం చేసినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం వెల్లడించింది. దీనిని వియత్నాంకు చెందిన సైబర్‌నేరగాళ్లు రూపోందించనట్లుగా తెలుస్తోంది. ఈ ట్రోజన్ ఈ ఏడాది మార్చి నుంచే ఆండ్రాయిడ్ యూజర్లపై దాడి చేస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. ఈ ట్రోజన్ ఏం చేస్తుందటే..! నెట్‌ఫ్లిక్స్, గూగుల్ యాడ్స్‌కు సంబంధించిన యాప్‌ల కూపన్ కోడ్లను ఫ్లైట్రాప్ ట్రోజన్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఎరగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూపన్ కోడ్లకోసం ఇచ్చిన లింక్‌లను ఓపెన్ చేయగానే యూజర్ల ఫేస్బుక్ ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని జింపెరియం తన పరిశోధనలో వెల్లడించింది. ఒకసారి యూజర్ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రోజన్ చేరితే ఫేస్బుక్ ఖాతాల ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఐడీ, లోకేషన్, ఈ-మెయిల్, ఐపీ అడ్రస్‌లను హాకర్లు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోటో కర్టసీ: జింపెరియం ఎలా వస్తాయంటే...! ఫ్లైట్రాప్ ట్రోజన్ గూగుల్ ప్లే స్టోర్‌లోని పలు యాప్‌ల ద్వారా, ఇతర థర్డ్‌పార్టీ యాప్స్ ద్వారా యూజర్ల స్మార్ట్ఫోన్లలోకి హ్యాకర్లు చొప్పిస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. గూగుల్ ఇప్పటికే హానికరమైన యాప్‌లను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఇతర థర్డ్‌పార్టీ యాప్స్ ద్వారా ఈ ట్రోజన్లు ఫోన్లలోకి వచ్చే అవకాశం ఉందని జింపెరియం హెచ్చరించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఫోన్లనుంచి వెంటనే తీసివేయాలని ఆండ్రాయిడ్ యూజర్లకు జింపెరియం సూచించింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ’క్లుప్తంగా సెర్ట్.ఇన్ హెచ్చరించింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్ డ్రాయర్ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్అప్డేట్ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్వేర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
సైబర్ స్పేస్‌లోకి ప్రమాదకర వైరస్!
న్యూఢిల్లీ: భారత సైబర్‌స్పేస్‌లో 'బయోజీ' అనే ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతోందని సైబర్ దాడుల నిరోధక సంస్థ సెర్ట్-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) హెచ్చరించింది. ఈ వైరస్ వినియోగదారుల కంప్యూటర్లలోకి చొరబడి వారి సమాచారాన్ని మార్చివేసి, తస్కరిస్తుందని తెలిపింది. ట్రోజన్ రకానికి చెందిన ఈ వైరస్ ఐదు మారు రూపాల్లో కంప్యూటర్లలోకి ప్రవేశించి రిమోట్ పద్ధతిలో పనిచేస్తుందని, వేరే చోట ఉన్న వ్యక్తులు దీని ద్వారా కంప్యూటర్లలోకి సమాచారాన్ని ఎక్కించడం లేదా తస్కరించడం, ఫైళ్లను డిలీట్ చేయడం, మార్చివేయడం వంటివి చేసేందుకు వీలవుతుందని పేర్కొంది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయోజీ(బీఐవోఏజడ్ఐహెచ్), ఇతర సారూప్య పేర్లతో కూడిన ఈ-మెయిల్స్, లింకులను ఓపెన్ చేయరాదని ఇంటర్నెట్ వినియోదారులకు సెర్ట్-ఇన్ సూచన చేసింది. గుర్తుతెలియని వెబ్సైట్లలోకి లాగిన్ కాకుండా ఉండటం, ఆటోరన్/ఆటో ప్లే ఆప్షన్లను డిజేబుల్ చేసుకోవడం, యాంటీ వైరస్ సాప్ట్వేర్లను అప్డేట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.