'జీతాలపై రాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాలపై రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య వ్యాఖ్యానించారు. సర్పంచ్ల జీతాలు పెంచలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. స్థానిక సంస్థలకు ప్రత్యేక గౌరవం తీసుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అంజయ్య పేర్కొన్నారు.
కాగా 'స్థానిక' ప్రజా ప్రతినిధులకు రాష్ర్ట ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. కౌన్సిలర్, సర్పంచ్ మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారందరికీ గౌరవ వేతనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నెలకు రూ. 7,500 తీసుకుంటున్న జెడ్పీ చైర్మన్లు ఇకపై లక్ష రూపాయలు అందుకోనున్నారు.