బస్సులోయలో పడి 17 మంది మృతి
లిమా: పెరూలోని అమెజాన్ ప్రాంతంలో బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి 150 మీటర్ల లొతున్న లోయలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నారని సోమవారం హైవే పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 17 మంది మరణించగా 32 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రి తరలించారు. ప్రమాద బాధితులలో ఎక్కువగా సీజర్ వాల్లేజో పబ్లిక్ స్కూల్‌కి చెందిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు స్కూల్ పరేడ్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.