రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు
సీఎం అధ్యక్షతన ఎంపిక కమిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 కేంద్ర సమాచార హక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు అందులో ప్రస్తావించింది. మొజాంజాహీ మార్కెట్లోని హౌసింగ్ బోర్డు బిల్డింగ్లో ఉన్న సమాచార హక్కు భవన్ కేంద్రంగా కమిషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషన్ ఏర్పాటుతోపాటు ప్రధాన కమిషనర్, రాష్ట్ర కమిషనర్ల నియామకాలకు సభ్యులను సిఫారసు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షునిగా ఉండే ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత జానారెడ్డి సభ్యులుగా ఉంటారు.