ఆర్టీసీలో.. మోగిన ఎన్నికల నగారా
నల్లగొండ : ఆర్టీసీలో ఎన్నికల నగారా మో గింది. కార్మిక సంఘాల గుర్తింపునకు ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండేళ్ల ఒకసారి జరిగే ఎన్నికలు అవిభాజ్య రాష్ట్రంలో చివరిసారిగా 2012 డిసెంబర్లో నిర్వహించగా వాటి గుర్తింపు గడువు 2014 డిసెంబర్లో ముగిసింది. కానీ వివిధ కారణాల దృష్ట్యా అప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యం కాలేదు. గుర్తింపు గడువు ముగిసిన ఏడాది వ్యవధి తర్వాత సొంత రాష్ట్రంలో తొలిసారిగా కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిన కాలంలో ఎన్ఎం యూ నుంచి విడిపోయి టీఎంయూ ఆవిర్భవించింది. ఉద్యమంలో చురుగ్గా పొల్గొన్న టీఎ ంయూకు అప్పటి పరిస్థితులు పూర్తి అనుకూలగా మారడంతో 2012 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంయూ, ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) కలిసి పోటీ చేశాయి. జిల్లాలోని ఏడు డిపోల్లో ఆరు డిపోల్లో టీఎంయూ విజయం సాధించగా.. దేవరకొండ డిపోలో మాత్రమే ఎన్ఎంయూ గెలుపొందింది. అయితే ఈ మూడేళ్ల కా లంలో కార్మిక సంఘాల్లో బేధాభిప్రాయాలు తలెత్తడంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
టీఎంయూ ఒంటరి పోరు..
ఈ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగానే పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం వైఫ్యలాన్ని ఎండగట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ ఏర్పడింది. దీంట్లో ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూ ఉమ్మడిగా కార్మికుల పక్షాన పోరాడుతున్నాయి. ఇదే వైఖరిని గుర్తింపు ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడు సంఘాలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాధన రాష్ట్ర నాయకుల పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అయితే ఈ మూడు సంఘాలు ఒకేతాటి పైకి వచ్చి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్లు కార్మికులకు పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు.
బలాబలాలు...
జిల్లాలోని నల్లగొండ, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ డిపోల్లో టీఎంయూకు (తెలంగాణ మజ్దూర్ యూనియన్) సుమారు 2,800 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ (స్టాఫ్వర్కర్స్ ఫెడరేషన్)-500, ఎన్ఎంయూ ( నేషనల్ మజ్దూర్ యూని యన్)-1000, ఎంప్లాయూస్ యూనియన్‌కు 750 ఓట్లు ఉన్నాయని సంఘాల ప్రతినిధులు చెప్తున్నా రు. టీఎంయూకు అన్ని డిపోల్లోనూ మెజార్టీ ఓటర్లు ఉండగా.. ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ డిపోల్లో మెజార్టీ ఓటర్లు ఉన్నారు. ఎన్ఎం యూ, ఈయూ సంఘాలకు కూడా అన్ని డిపో ల్లో ఓటర్లు ఉన్నారు. అయితే కార్మిక సంఘాల్లో వర్గపోరు కారణంగా ఈ ఎన్నికలు రసవత్తరంగా మా రే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా టీఎం యూ నాయకత్వ తీరుపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్ఎం యూలో రెండు గ్రూపుల మధ్య ఆదిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. దీంతో పాటు మిగిలిన సంఘా ల్లో కొందరు ఓటర్లు అటుఇటుగా ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 13న కార్మిక సంఘాల తా త్కాలిక ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాల పై పరిశీలన చే సిన అనంతరం తుది ఓటర్ల జాబితాను 25 తేదీన ప్రకటిస్తారు. గుర్తింపు ఎన్నికలు జూలై 19న నిర్వహిస్తారు. అదే రోజున సా యంత్రం అన్ని డిపోల్లో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తా రు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను జూలై 25, 26 తేదీల్లో స్వీకరిస్తారు. ఎన్నికల ఫలితా లను ఆగస్టు 6న అధికారికంగా ప్రకటిస్తారు.