విద్యాభివృద్ధికి పెద్దపీట
న్యాల్కల్: విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ ఎండీ ఫరీదొద్దీన్ అన్నారు. ఆయన నివాసంలో ఆదివారం న్యాల్కల్ మండల టీఎస్‌యూటీఎఫ్ నూతన క్యాలెం డర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి పర్చడంలో భాగంగా రాష్ట్రంలో అనేక నూతన గురుకుల, సంక్షేమ పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అంకిత భావంతో పని చేసి నాణ్యతతో కూడిన విద్యనందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన అవి పూర్తి స్థాయిలో విజయ వంతం కావాలంటే ఉపాధ్యాయుల పాత్ర కూడా ముఖ్యమైందన్నారు.
కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు కిషన్ పవర్, విజయ్‌కుమార్, చంద్రప్ప, నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, వీరారెడ్డి, గౌసోద్దీన్, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ఎండీ.సమీయోద్దీన్, గంగామోహన్, కాశీనాథ్, ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.