గురుకుల కళాశాలలకు దరఖాస్తు గడువు పొడిగింపు
కరీంనగర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు టీఎస్డబ్ల్యూఆర్ఎస్ కన్వీనర్ ఏంజెల్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను మొత్తం 11 గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలోని గురుకుల పాఠశాలను కళాశాలగా స్థాయి పెంచినట్లు వెల్లడించారు. అల్గునూర్లోని సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ నుంచి బాలురు, చింతకుంట గురుకుల విద్యాలయం నుంచి బాలికలు దరఖాస్తు పొందవచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు చింతకుంట ప్రిన్సిపాల్ 90000 49542, అల్గునూర్ ప్రిన్సిపాల్ 94926 48847 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.