ఇక మిగిలింది టగ్ ఆఫ్ వారే!
పుర్నియా: ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలు ఎంతో ధైర్యంగా ఉన్న ఐదో దశ ఎన్నికల విషయంలో మాత్రం ఆ పార్టీ నేతలు కొంత తడబడుతున్నారు. ఎందుకంటే ఐదో దశ(చివరి దశ) ఎన్నికలు జరగనుంది సీమాంచల్ ప్రాంతంలో. 2014లో దేశమంతా ప్రధాని నరేంద్రమోదీ హవా వీస్తున్నా.. ఒక్క సీమాంచల్ మాత్రం ఎన్డీయే ప్రభావం పెద్దగా కనిపించకుండా పోయి నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి భంగపడింది.
ఇక్కడ మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకోసం గురువారం చివరి దశ ఎన్నికల పోరు జరగనుంది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరోపక్క, ఇక్కడ కేవలం ప్రధాన పోటీ ఒక్క బీజేపీ నితీశ్ కుమార్ కు మధ్య మాత్రమే కాకుండా జన అధికార్ పార్టీ(జేఏసీ) నేత పప్పు యాదవ్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ కూడా ఆరు చోట్ల తన పార్టీ మజ్లిస్ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం సీమాంచల్‌లో ఉంటుందేమో వేచి చూడాల్సిందే.