బోటు తిరగడి 10 మంది సైనికులు మృతి
సముద్రంలో సైనికులతో వెళ్తున్న బోటు తిరగబడింది. ఆ ఘటనలో 10 మంది సైనికులు మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. ఇస్తాంబుల్ దేశంలోని ఎజియన్ ప్రావెన్స్లో ఈజామీర్ సమీపంలోని సముద్రంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. ఆ బోటులో ప్రయాణిస్తున్న పలువురు పౌరులతోపాటు, పడవ నడిపే వారి ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదని తెలిపారు. వారి కోసం అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు.
మరో ఆరుగురు సైనికులు సముద్రంలోకి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారని వివరించారు. ఆ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. పరిమితికి మించి బోటులోకి ప్రయాణికులు ఎక్కడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ దుర్ఘటన నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుందని స్థానిక పత్రిక హూరియత్ మంగళవారం వెల్లడించింది.